TRIKONASANAM


  త్రికోణ ఆసనం 



ఈ ఆసనాన్ని ఈ పేరుతో నే ఎందుకు పిలుస్తాము అంటే ఈ ఆసనం వేసిన సమయం లో మనశరీరం త్రికోణ ఆకారం ఏర్పడుతుంది .ఈ ఆసనం వేసేందుకు మొదటిగా నిటారుగా నిలబడండి తరువాత  కాళ్ళని ఒకదానికి  ఒకటి దూరం గా మీకు సౌకర్యవంతం గా ఉండేలా నిలుచోండి మీ చేతులను మీ రెండు భుజాలకు స్ట్రైట్ గా ఉండేలా  పెట్టండి రెండు చేతులు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత దీర్ఘం గా శ్వాస తీసుకుంటూ కుడివైపుకు మీ చేతులు వంచండి. మీ కుడి కాలు చెలమందలి ని మీ కుడి చేతితో తాకాలి .చేతిని మెల్లగా ఆకాశం వైపుకు ఎత్తండి .కొంతమంది కాలు చీలమండలి తాకడానికి కష్టం అనిపిస్తే మీకు వీలైనంతవరకు మాత్రమే మీ చేతిని సాగా డేయండి. ఈ భంగిమలో కొంతసేపు విశ్రాంతి గా ఉండండి .సాధారణం గానే గాలిని తీసుకోండి .తిరిగి మల్లి మీరు నిటారుగా ఉన్న భంగిమకు రండి .తరువాత ఇంతకముందులానే ఎడమవైపు కూడా చేయండి ఈ ఆసనం చాల సరళమైంది మరియు ఉపయోగకరమైనది ఈ ఆసనం వెన్నుముకలోని కండరాలను తిన్నగా ఉంచుతుంది అంతే కాకుండా చదునైన పాదం ఏర్పడకుండా చేస్తుంది .అంతేకాకుండ మీ ఛాతీని ,భుజాలను తొడలను , వెన్నుముకలను దృఢం గా తయారు చేస్తుంది 

ముఖ్యగమనిక :

ఈ ఆసనం వేసే ముందు  మీ శరీరం లోని  మేడ,భుజాలు ,లేదా వెన్నుముక గాయాలు అయినా ఆపరేషన్ జరిగి ఉన్న ఈ ఆసనాన్ని చేయకూడదు  

Comments

Popular posts from this blog

HIMALAYA FACE WASH

WEIGHT LOSS FOR 21 DAYS CHALLENGE

VIPAREETHAKARANI AASANAM